Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం ప్రత్యేకత
- మూడుసార్ల కంటే ఎక్కువసార్లు గర్భం దాలిస్తే మహిళలకు ప్రమాదం
- గ్రామీణ మహిళలు అవగాహన కలిగి ఉండాలి
- డాక్టర్ సోమ్యా గోయల్
నవతెలంగాణ-హన్మకొండ
హన్మకొండలోని దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సోమ్యా గోయల్ నేతృత్వంలోని శస్త్రచికిత్స వైద్య బృందం గర్భిణీకి ఇటీవల చేసిన శస్త్ర చికిత్స ప్రత్యేకతను చాటుకుంది. శస్త్రచికిత్స అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 35 ఏండ్ల గర్భిణి నాలుగోసారి గర్భం దాల్చగా దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ సోమ్యా గోయల్ వద్ద ఆరోగ్య సంరక్షణ పరీక్షలు చేయించుకుంది. 5వ నెలలో ఆమె ప్లాసెంటా (కడుపులోని పిండానికి ఆహారం ఇచ్చే అవయవం) తక్కువగా ఉన్నట్లు డాక్టర్ సోమ్యా గోయల్ గుర్తించారు. 9 నెలల గర్భధారణ సమయంలో పిండం పరిస్థితిని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. దీనిలో ప్లాసెంటా మూత్రాశయంలోకి కూడా విస్తరించినట్లు గుర్తించారు. పూర్తి జాగ్రత్తతో డాక్టర్ డి మోహన్ దాస్, డాక్టర్ సోమ్యా గోయల్ నేతృత్వంలో డాక్టర్ లక్ష్మీదీపక్ అనస్థీషియా బృందం కలిసి రోగికి శస్త్రచికిత్స చేశారు. అన్ని జాగ్రత్తలు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, శిశువు డెలివరీ చాలా క్లిష్టమైంది. బేబీ డెలివరీ తర్వాత రోగికి ఆపరేటింగ్ టేబుల్‌పై విపరీతంగా రక్తస్రావం కావడంతో పూర్తిగా గర్భాశయం తొలగించారు. సబ్ టోటల్ హిస్టెరెక్టమీకి బదులుగా యూరినరీ బ్లాడర్ తెరిచి చికిత్స చేశారు. వైద్య బృందం కృషితో సదరు మహిళకు ఒక రోజు మాత్రమే ఐసీయూ అవసరం ఏర్పడింది.
శస్త్రచికిత్సతో తల్లీబిడ్డ క్షేమం
ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు డాక్టర్ సోమ్యా గోయల్‌కు కృత్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమ్యా గోయల్ మాట్లాడుతూ.. మహిళలు ముఖ్యంగా గ్రామీణ మహిళలు అవగాహనా లోపంతో ఎక్కువసార్లు గర్బం దాల్చడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మహిళలు అవగాహనతో మెదిలి ఒకటి లేదా రెండవసారి గర్భానికే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకో వాలని సూచించారు. యాధృచ్చికంగా రోగి సొంత సోదరికి గత ఏడాది ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి సమస్య రాగా కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉంచారు.