Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
ములుగు మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో ఆర్అండ్బీ రోడ్డు రెండు వైపులా సైడ్ డ్రైనేజీ లేక ఏండ్లుగా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని సర్పంచ్ గండి కల్పనా కుమార్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య దష్టికి తీసుకెళ్లి ఆమె మాట్లాడారు. అంతర్గత రోడ్లు కూడా అధ్వానంగా మారాయన్నారు. సీసీ రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.