Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంఈఓ గొంది దివాకర్ మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొని మాట్లాడారు. వంట ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిం చాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల అధ్యక్షురాలు ఎస్ రమ, ఉపాధ్యక్షురాలు సామ సమ్మక్క, ఎమ్మార్సీ కంప్యూటర్ ఆపరేటర్ విష్ణు, సీఆర్పీలు చందు, రజిత, రమేష్, తదితరులు పాల్గొన్నారు.