Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
టీఎస్ఎన్పీడీసీఎల్ ములుగు జిల్లా డివిజ నల్ ఇంజినీర్‌గా తాడ్వాయి మండలం పంభా పూర్ గ్రామానికి చెందిన పులుసం నాగేశ్వర రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1998 లో మెదక్ జిల్లా సింగూర్ జన్కోలో విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎది గారు. ప్రమోషన్ పై మంచిర్యాల డీఈగా పని చేశారు. 2018లో ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ నక్కలగుట్ట వద్ద విద్యుత్ భవన్లో అత్యుత్తమ సేవలందించారు. ఏజెన్సీలో మారు మూల గ్రామంలో పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని విద్యుత్ శాఖలో ఉద్యోగం పొంది అంచలంచలుగా ఎదగడం విశేషం. తిరిగి ఆయన పుట్టిన గడ్డ ములుగు జిల్లాకు డివిజనల్ ఇంజినీర్(డిఈ)గా రావడం పట్ల పలు గిరిజన, ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆయనను ములుగు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈ పులుసం నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన గడ్డపై ఉద్యోగ సేవలు అందించే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఉత్తమ సేవలు అందిం చేందుకు మండల విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు.