Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి వివిధ శాఖ అధికారులకు సిఫారసు చేశారు. కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దరఖాస్తు తిరస్కరిస్తే కార ణాలు తెలుపుతూ ఆర్జిదారునికి అందజేయా లన్నారు. కాగా సోమవారం మొత్తం 33 దరఖాస్తులు వచ్చా యి. ఇందులో పెన్షన్ మంజూరు చేయాలని, ఉపాధి కల్పించాలని, భూ సమస్యలు పరిష్కరిం చాలని, తదితర వాటిపై ఎక్కువ ఆర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతులు సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. వెంకటాపురం మండలంలో భూమి సమస్య లకు పరిష్కారం చూప్పాలన్నారు. బండారుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ కార్యా లయాల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. మున్సి పాలిటీ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ములుగు, బండారుపల్లి జంగాలపల్లి గ్రామలలో ప్రభుత్వ భూములను సర్వే చేయాలని ఆదేశించారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎందుకు మంజూ రు కాలేదో తెలపాలని డీఆర్డీఓ సిబ్బందిని ఆదేశిం చారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి నుండి ఏటురునాగారం వరకు రోడ్డు, మేడారం నుండి పస్రా వరకు, తాడువాయి నుండి మేడారం రోడ్డు ధ్వంసమైనచోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జగన్నాధపురం నుండి ఎదిరా వరకూ రోడ్డు పనులు టెండర్ పూర్తి చేసి పనులు ప్రారం భించాలన్నారు. పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఈ శాఖలో ఖాళీలను భర్తీ చే యాలని, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయా లన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గహాలను అద్దె భవనంలోకి మార్చాలని, కొత్త భవనాలను నిర్మాణానికి ప్రతిపా దనలు పంపించాలని ఆదేశించారు. విద్యార్థుల స్కాలర్షిప్ పెండింగ్ లేకుండా చూడాలని జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లకు సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే పౌష్టికాహార కిట్లను అందించాలని సూచించారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
పశువులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య రైతు లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటికి జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయని, వైద్యం అందించినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 40 వేల పశువులకు ఎల్ఎస్డి టీకాలు వేశామన్నారు. టీకాల వేసేందుకు 27 టీములు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మరమ్మత్తు పనులు ప్రారంభించాలి
జాతీయ రహదారి మరమ్మత్తు పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్లో జాతీయ రహదారుల భద్రతపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. మహమ్మద్ గౌస్ పల్లి నుండి గట్టమ్మ దేవాలయం వరకు జాతీయ రహదారిపై సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎర్రగట్టమ్మా, చల్వా యి, పస్రా, గట్టమ్మ దేవాలయం వరకు ధ్వంసమైన చోట్ల రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించాలన్నారు. జవహర్ నగర్ లోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలు అమర్చాలన్నారు. జాతీయ రహదారి వెంట రోడ్డు మధ్యలో ఎవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహిం చాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, డీఆర్ఓ కే రమాదేవి, డీఎంహెచ్ఓ అప్పయ్య డీఈఓ జి పానిని, సీపీఓ ప్రకాష్, డీపీఓ వెంకయ్య, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కరుణాకర్, జిల్లా పశు వైద్య,సంవర్ధక శాఖ అధికారి కె విజయభాస్కర్, మల్లంపల్లి పశు వైద్యులు శ్రీధర్ రెడ్డి, ఐటీడీఏ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర, జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ,డెమో తిరుపతయ్య, ఎనెహెచ్ఎఐ నవీన్ కుమార్, ఎన్హెచ్ఏఐ హేమక్ చంద్ర చౌదరి, టోల్ ప్లాజా మేనేజర్ జవహార్ నగర్ ఉన్నారు.