Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీ డి రఘుచందర్
నవతెలంగాణ - రఘునాథపల్లి
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని స్తేషన్ఘన్పూర్ ఏసీపీ డి రఘుచందర్ అన్నారు. సోమవారం మండలంలోని మేకలగట్టు గ్రామంలో వరంగల్ సీపీ ఆదేశానుసారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం మేకల గట్టు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గడ్డమీది సంధ్యారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రోడ్డు ప్రమాదాల దష్ట్యా జాతీయ రహదారిపై తగు జాగ్రత్తలు, అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని అన్నారు. విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఆన్లైన్, బ్యాంకింగ్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అపరిచిత వ్యక్తులపట్ల పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు తలెత్తితే డయల్ 100కు సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ఆర్. సంతోష్, ఆలే రాఘవేందర్,ఎస్సైలు వీరేందర్, రఘుపతి, శ్రవణ్, ఎంపీటీసీ బిక్షపతి నాయక్ ఏఎస్సైలు, పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.