Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
దేశ భవిష్యత్తు యువత నడవడికపై ఆధారపడి ఉందని ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్ రావు అన్నారు. సోమవారం పట్టణంలో బేడ బుడిగ జంగాల యువజన సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన మండలస్థాయి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. యువత ఉపాధి మార్గాలను ఎంచుకోవడంలో ముందుండాలన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకా శాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించి అనేకమందికి ఉపాధి అవకాశాలు చూపించినట్లు తెలిపారు. ఇటీవల పాలకుర్తి నియోజకవర్గంలో శిక్షణ పొందిన యువత ఎస్సైలుగా, కానిస్టేబుల్ గా రాత పరీక్షల్లో అర్హత సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం ఫిజికల్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి పట్టణంలో నీ యతిరాజారావు పార్కు లో మైదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో నిర్వాహకులు తూర్పాటి నీలేష్, తూర్పాటి మండిస్, తాసిల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, ఎస్సై గండ్రాతి సతీష్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పిటిసి, జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళంపల్లి శ్రీనివాస్, మున్సి పల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, టీఆర్ఎస్ మండల్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాస్, కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జలీల్, తదితరులు పాల్గొన్నారు.