Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ-గార్ల
గ్రామ పంచాయతీ కార్మికులకు గొడ్డలి పెట్టు గా మారిన మల్టీపర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి కార్మికుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో ధర్మారపు సుధాకర్, జి.నాగేశ్వరరావు అధ్యక్ష తన ఏర్పాటు చేసిన యూనియన్ జిల్లా మహసభలో ఆయన మాట్లాడారు. గతంలో జీపీ కార్మికుల అధ్వర్యంలో నిర్వహించిన పో రాటాల ఫలితంగా గ్రామ పంచాయతీ కార్మి కులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు విస్మ రించారన్నారు. ప్రజా ప్రతినిధులు జీతాలు లక్షల రూపాయలలో పెంచుతున్న ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కారోబార్, బిల్ కలెక్టర్ లపై ప్రజాప్రతినిధులు, అధికారుల వేధిం పులు మానుకోవాలని అన్నారు. జీపీ కార్మి కులను పర్మినెంట్ చేసి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.26 వేలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అమరవీరులకు సంతాప తీర్మానాన్ని కందు నూరి శ్రీనివాస్ ప్రవేశ పెట్టారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య జెండావిష్క రించారు. ముందుగా పట్టణ పురవీధులలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సీఐటీ యూ రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్, జిల్లా అధ్యక్షులు కుంట ఉపేందర్, మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండ్ల అప్పిరెడ్డి వెంకట దాసు, ఉపేంద్ర చారి,జాని,శంకరయ్య, మంగిలాల్, లతీఫ్, వెంకన్న, దాస్,ప్రేమ్ కుమార్, దస్తాగిరి,శ్రీను ,ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.