Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శివలింగయ్య
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
జిల్లావ్యాప్తంగా సమస్యలపై వచ్చిన ప్రజా దరఖాస్తులను సత్వరం పరిస్కరిం చాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజా దరఖాస్తులను కలెక్టర్ స్వీకరిం చి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిం చడం జిల్లా అధికారులు ముందుండాలని అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో మొత్తం 44 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ఆసరా పింఛన్లు, భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ మధుమోహన్, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, డీపీఓ రంగాచారి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.