Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బ్రిటిష్ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని తన చాణిక్యంతో దఢమైన నిర్ణయాలతో ఏకం చేసి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ జె.సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎస్పీ జాతీయ ఐక్యత దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళి అర్పించి పోలీ సు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాల భారతావని ఏకతాటి పై నడిపించి, భారత ప్రథమ హౌం శాఖ మంత్రిగా పనిచ ేసిన వల్లభాయ్ పటేల్ గారు ఎందరికో ఆదర్శమన్నారు. వారి పోరాటం తెలం గాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయుధంగా పని చేసిందని అన్నారు. కార్యక్రమంలో జి ల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, డిఎస్పీ ఏ. రాములు, సీఐలు రాజిరెడ్డి, జానీ నర్సింహులు, పెద్దన్న కుమార్, అజరు, జితేందర్ రెడ్డి, సంతోష్, సతీష్, డిపిఓ ఏవో ఆయూబ్ ఖాన్, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, పాల్గొన్నారు.
సుబేదారి : భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు గాంచారని, ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నా మని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా అధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వాతం త్య్రం వచ్చిన తర్వాత భారత తొలి ఉపప్రధాని, తొలిహోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జేసీ సంధ్యారాణి, డిఆర్వో వాసు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా : భారత దేశ ఉక్కుమనిషి మొట్టమొదటి ఉపప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే 'జాతీయ ఐక్యతదినోత్సవాన్ని కె.యు.సి రోడ్, హన్మకొండలోని ఏకశిల హైస్కూల్లో సోమ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ కు సంబంధించిన పలు రకాల ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకశిల హై స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఉన్న అనేక సంస్థానాలను విలీనం చేయడానికి సర్థార్ చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ బేతికొండల్ రెడ్డి, ప్రిన్సిపాల్ బేతి శైలజారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ నీల సుష్మారెడ్డి, ఉపాధ్యాయులు వేణు, లక్ష్మి నారాయణ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి : సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పమే నేటి భారతావనికి మార్గదర్శనమని జెడ్పిహెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు నరసింహాస్వామి అన్నారు. సోమవారం మండలంలోని మొట్లపల్లి జెడ్పిహెచ్ఎస్లో నిర్వహించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్సిసి ఆఫిసర్ రాజయ్య, ఎస్ఎంసి చైర్మన్ ఆలగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు సంపత్ కుమార్, సదానందం, వీరయ్య,ఉమారాణి, రవీందర్ శ్రీధర స్వామి, మధుసూదన్, రవి ప్రసాద్, సి అర్ పి వసంత, విద్యార్థులు పాల్గొన్నారు.
మల్హర్ రావు : జిల్లా నోడల్ ఆఫీసర్, తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి. దేవరాజం ఆదేశాల మేరకు సోమవారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవీందర్ ఆధ్వర్యంలో కళాశాలలో సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కోల్ బెల్ట్ : వల్లభాయ్ పటేల్ జయంతిని సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ర్యాలీని నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జిఎం శ్రీనివాసరావు హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ జిఎం కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఎస్ ఓ టు జి ఎం విజయ ప్రసాద్, ఎజీఎంలు జోతి, రామలింగం, ఏరియా అధికార ప్రతినిధి తుకారం, ఏరియా సర్వే అధికారి రాజగోపాల్, ఐటీ మేనేజర్ రజనీకుమారి, పిఓ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
శాయంపేట : మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం వారి చిత్రపటాలకు ఆయన పూలమాలవేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మల రమేష్, రాజేందర్, రఫీ, రాజు, విష్ణు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురు కుల పాఠశాలలో, కాట్రపల్లి సిఎస్ఐ పాఠశాలలో సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవ హారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సుభాషిని, నెహ్రు యువ కేం ద్ర కోఆర్డినేటర్ సునీల్ నాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.