Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హన్మకొండ చౌరస్తా
హనుమకొండలో ఎస్ టి పి ఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పల్వాస్ ఆఫ్ ఇండియా ఇంక్యుబేషన్ సెంటర్లో సోమవారం ఎస్సార్ ఫ్యూచర్ గేట్వే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ డాక్టర్ సిహెచ్ శ్రీని వాస్ రావు ఆధ్వర్యంలో డిప్లమో ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు ఇంటర్ షిప్, ఇండిస్టియల్ ట్రైనింగ్లో భాగంగా పలు జిల్లాల నుండి 250 మంది విద్యార్థిని విద్యార్థులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారన్నారు. వీరికి అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి వరంగల్ ఎస్ టి పి ఐ ఐ ఎల్ సి డైరెక్టర్ రంజిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులకు డిప్లమో అర్హతలు సాధించిన వారిని అభినందించారు. అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగపడే విధంగా ఉన్న ట్లు వాటికి పేటెంట్లు అప్లై చేసి మార్కెట్ అవకాశాలు కూడా వివిధ రూపాలలో రూపాంతరం చెందుతాయని తెలిపారు. ఇంజనీరింగ్లో థియరీ తో పాటు సాంకేతికంగా ప్రాక్టికల్ గా వివిధ ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నట్లు వీరికి స్టార్ట్ అప్ ఇండియా టీఎస్ఐఐసీ ఎమ్మెస్ ఎమ్మి ఎస్ టి పి ఐ మొదలైన ఆమోదిత సంస్థలతో కూడిన సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేశారు. వరంగల్ ఎస్ టి పి ఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరుగైన నైపుణ్యతతో పాటు ఉద్యోగ అవకా శాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరో 5 ఎమ్మెల్సీ కంపెనీ నీళ్లు కూడా వరంగల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక్కడి ప్రతిభకు ప్రసిద్ధిగా నిలిచిన ఈ సంస్థలో శిక్షణ పొందేందుకు కరీంనగర్ వరంగల్ కొత్తగూడెం కాటారం సిద్దిపేట్ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నారని సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.