Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్ రెగ్యులర్గా విధులకు హాజరు కాని వారిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మ కొండ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్ అన్నారు. ఆదివారం లష్కర్ బజార్, బాలసముద్రం పరిధిలో ఉన్న లోకల్ హాస్టల్స్ ను ఎస్ఎఫ్ఐ నాయకులు కాలినడకన తిరుగుతూ హాస్టల్స్ ను సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డెన్స్ కొంతమంది రెగ్యులర్గా విధులకు హాజరు కావడం లేదన్నారు. వేతనాలు మాత్రం సక్రమంగా తీసుకుంటున్నారని వీరిని పర్యవేక్షించే అధికారులు కూడా పత్తా లేరని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం కూడా కొన్ని హాస్టల్స్ లో అందిం చడం లేదన్నారు . ఇప్పటివరకు కొన్ని హాస్టల్స్ విద్యార్థులకు యూనిఫార్మ్స్ కూడా రాలే దు అన్నారు. విద్యార్థులకు సమస్యలు ఉన్నా వార్డెన్సు అధికారులు ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. అలాగే లస్కర్ బజార్లో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు హిందీ టీచర్ సైన్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు స్టాలిన్ ప్రశాంత్ అజయ్ సాయి పాల్గొన్నారు.