Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ కలెక్టరేట్/మట్టెవాడ
వరంగల్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో అరకొరవసతులు కొరవడ్డాయని మౌలిక వసతులు కలిపించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వ హించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులకు సరిపడా ఫాకల్టీ లేదని 47 ఖాళీలు ఉన్నాయని పురా తన భవనంలో సమస్యలు తాండవిస్తున్నాయని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రికి జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందచేసిన పట్టించుకునే వారు కరువైయారని ఆయుర్వేద వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధాన రహ దారిపై ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థుల నాయకులూ సంజీవ్ నాయక్, శ్రీకర్, వెంకట సాయి, పాల్గొన్నారు.