Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్
నవతెలంగాణ-సుబేదారి
టిఎన్జీవో యూనియన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆకాంక్షల కోసం ఉద్యోగాలను ప్రా ణాలను పణంగా పెట్టి ఉద్యమాలు చేసిన టీఎన్జీవోస్ యూనియన్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణ మన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేష్ ,తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, వెంకటేశ్వర్లు, 4వ తరగతి ఉద్యోగుల సం ఘం అధ్యక్షులు దాస్య నాయక్, పెన్షనర్స్ సంఘంబాధ్యులు జనార్ధన్, సారంగ పాణి, గోవర్ధన్, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, టీ ఎన్ జీ ఓస్ కేంద్ర సంఘ నాయకులు శ్యామ్ సుందర్, కత్తి రమేష్, రాము నాయక్, సారంగపాణి జిల్లా టీఎన్ జీ ఓస్ నాయకులు మోయిజ్, సలీం, చీకటి శ్రీనివాస్, బింగి సురేష్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ : ఉద్యోగుల ఆత్మ గౌరవం, మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బేషరతుగా ఉద్యోగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ అధ్యక్షుడు గజ్జల రామ్‌కిషన్ డిమాండ్ చేశారు. సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోయస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు వరంగల్ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సోమవారం ఎంజీఎం కూడలిలో అన్ని శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కార్య క్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టిఎన్జీవోస్ నాయకులు తమ స్వార్థం కోసం కాకుండా ప్రజలు, ఉద్యోగస్తుల క్షేమం కోసం నిస్వార్ధంగా పని చేశార న్నా రు. 75 సంవత్సరాల చరిత్రలో టిఎన్జీవో సంఘం ఎప్పుడు ప్రభుత్వాలతో లా లూచీ పడ లేదని అవసరమైతే తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వాలతో పోరాడి సాధిం చుకున్న చరిత్ర సంఘానికి ఉందన్నారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహా అధ్యక్షులు హేమ నాయక్, ఉపాధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, సిటీ అధ్య క్షులు వెలిశాల రాజు, యాకమ్మ, సంయుక్త కార్యదర్శులు చందర్ రావు, రవీందర్, శ్రీ జ్యోతి, సునీ తా నాయర్, ఎంజీఎం యూనిట్ కార్యదర్శి రమేష్, రామకృష్ణ, మెడికల్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి శ్రీనివాస్, రజనీకాంత్, విద్యాశాఖ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, ఎనుమముల మార్కెట్ కమి టీ కార్యదర్శి రాహుల్, మార్కెట్ ఫోరం అధ్యక్షుడు జన్ను భాస్కర్, యూనియన్ నాయకులు శంకేసి రాజేష్, గజ్జల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.