Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కుల పరిరక్షణకు అలుపెరుగని పోరాటం
- సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
నవతెలంగాణ-హనుమకొండ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఏఐటీయూసి 103వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నుండి హరిత కాకతీయ హోటల్ వరకు వందలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐటీయూసి పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండే శ్రమజీవులైన కార్మికులపై దాడి ప్రారంభించిందని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్, పెట్టు బడి దారీ శక్తులకు అనుకూలంగా మార్చివేశారని, 44 కోడ్లుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చారన్నారు. రానున్న రోజుల్లో అన్ని రంగాల కార్మికులను చైతన్య పరిచి, సంఘటిత పరిచి వారి హక్కుల పరిరక్షణకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా ఏఐటీయూసి అద్యక్షులు జక్కు రాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట బిక్షపతి, గౌరవాద్యక్షులు నేదునూరి రాజమౌళి, ఉప ప్రధాన కార్యదర్శి మద్దెల ఎల్లేష్, ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్, మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్, ఆదరి రమేష్, కార్యదర్శి గుంటి రాజేందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజి ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : శివనగర్ లోని తమ్మెర భవన్లో ఏఐటీయూసీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ టి యు సి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వా విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కార్మి కులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యనిర్వాహణ అధ్యక్షులు దండు లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖాసిం, జిల్లా సహాయ కార్యదర్శి ఎండియాకూబ్, జిల్లా ఏఐటియుసి నాయకులు సండ్ర కుమార్, పరికిరాల రమేష్, మంద ఐలయ్య తదితరులు పాల్గొన్నారు
వర్ధన్నపేట : వర్ధన్నపేట సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ 103వ అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హమాలీ కార్మికులు జలగం సామెల్ ఏఐటీయూసీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్య అధితిగా వరంగల్ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు జలగం బిక్షపతి, కార్యదరి సహాయ కార్యదర్శి ల్యాదల్ల ఆనందం, కార్యవర్గ సభ్యులు కొండేటి శ్రీనివాస్, తుమ్మల వేణు, జలగం రవి, జలగం మెహన్ బాబు, ఎలురకంటి భుజంగం, శీను, తదితరులు పాల్గొన్నారు.
కోల్బెల్ట్ : ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 103 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రం లోని కొమరయ్య భవన్లో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘమన్నారు. ఇకనైనా కార్మిక వర్గం మేలుకొని ఏఐటీయూసీ తో అడుగులో అడుగు వేసి కధం తొక్కాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటేష్, శ్రీకాంత్, ప్రవీణ్, హైమద్, చంద్రయ్య, మల్లయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.