Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గు వెంకటరాణి సిద్ధు
- పట్టణంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-భూపాలపల్లి
పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, అదేవిధంగా కుక్కుల బెడద చాలా ఉందని వాటి నుండి ప్రజలకు రక్షణ కలిపించి వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడుతూ ముఖ్యంగా పట్టణంలో పశువులు రోడ్లపై ఉండి విచ్చల విడిగా తిరుగుతున్నాయని దానితో ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. వాటిని వెంటనే అధికారులు గోసంరక్షణకు తరలిం చాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతగా పూర్తి చేసి పట్టణంలోని 30 వార్మలకు స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందించాలన్నారు. అట్లాగే దోమల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలని వెంటనే ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమీషనర్ పూజారి అవినాష్, ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, మున్సిపల్ ఏఈ రోజావాణి, కౌన్సిలర్లు, అటవి, సింగరేణి, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.