Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్, భూపాలపల్లి కలెక్టర్లు గోపి, భవేష్మిశ్రా
నవతెలంగాణ-వరంగల్ కలెక్టరేట్
వివిధ స్వయం ఉపాధి పథకాలతో జీవనోపాధి పెంపొందించుకోవడానికి, భూ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అర్జీలు సమర్పించడానికి వచ్చే అర్హులైన వారికి తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరిం చారు. తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ సాధ్యమైనంత తొందరగా అర్హులైన దరఖాస్తుదారులకు పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఈరోజు ప్రజా వాణిలో వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తుల గురించి కలెక్టర్ వివరిస్తూ భూమి సంబంధించిన సమస్యలు-14,ఎడ్యుకేషన్-03 ఎంజీఎం-01డిపిఓ-02 ఎస్సీ కార్పొరేషన్-01, గురుకులం-02 మార్కెటింగ్-01 , డి ఆర్ డి ఓ-02, డిస్టిక్ కోఆపరేటివ్-01, డబుల్ బెడ్ రూమ్-01ల్యాండ్ సీలింగ్-02 , ఎలక్ట్రిసిటీ-02, జిడబ్ల్యుఎంసీ-01లొంగిపోయిన మావోయిస్టుల కు పునరావాస సౌకర్యం నిమి త్తం-02 మొత్తం 35దరఖాస్తులు స్వీకరించారు. భూములకు సంబంధించినవి ఎక్కువ గా వచ్చాయని, వాటిని సంబంధిత అర్జీదారుల సమస్యలను పరిష్కరిం చడంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశిం చారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్సవ కోట, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, తదితరలు పాల్గొన్నారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమావేశం మం దిరంలో ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 64 మంది దరఖాస్తుదారుల నుండి అదనపు కమిషనర్ రవీందర్ వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్ విభా గానికి 19, టౌన్ ప్లానింగ్ విభాగానికి29, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగానికి 9, రెవిన్యూ విభాగానికి 6, హార్టికల్చర్ 1, మొత్తం 64 వినతులు స్వీకరించారు. కొన్ని వినతులు పద్మాక్షి గుండం కట్టపై ఉన్న ఏడాకుల చెట్లు పుప్పడి రేణువులతో ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులు సంభవిస్తున్నాయని, దీంతో ఆ చెట్లను నరికి వేయడానికి అనుమతి ఇవ్వాలని కాలనీవాసులు కోరారు. కాకతీయ జూ పార్క్ లోకి వస్తున్న మురుగునీటి నీ వేరే దానికి మళ్లించాలని వినతి పత్రం అందజేశారు. వాసవి కాలనీ లో వీధిలో దీపాలు ఏర్పాటు చేయాలని వాసవికాల నీ, వాసులు వినతిపత్రం అందజేశారు. 2వ డివిజన్ భగత్ సింగ్నగర్లో సైడ్ కాల్వలు నిర్మించి కాలనీ వాసుల కష్టాలను తీర్చాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. 20 డివిజన్లో ఖాళీ స్థలంలో చెట్లు పెరగడం వ్యర్ధపదార్థాలు, మురికి నీరు చేరడం వలన దోమలు చేరి, డెంగి మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని నజీర్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ జోనా, రషీద్, శ్రీనివాస్ రెడ్డి, సి హెచ్ ఓ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వెంకన్న, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డిసిపి ప్రకాష్ రెడ్డి తరులు పాల్గొన్నార
భూపాలపల్లి : జిల్లాలోని ప్రజలు వివిధ సమస్య్యలపై సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 38 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని, దరఖాస్తు తిరస్కరణ గురైన సందర్భంలో పూర్తి వివరాలు సంభదిత అభ్యర్థికి వెల్లడించాలని అధికారులకు ఆదేశించారు.