Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్, జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే తన కార్యాల యం లో లబ్ధిదారులను ఎంపిక చేస్తూ తన కార్యకర్తలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆర్థికంగా లేని దళిత కుటుం బానికి మొదటగా బంధువు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని అధికారుల ద్వారా అమలు చేయాలని లేనట్ల యితే ఆందోళన పోరాటాలను ఉధృతంగా కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు దూడపాక రాజేందర్, జిల్లా నాయకులు రామారావు, కొలువురు రవీందర్, కొర్రల రజిత, సుమన్, దేవేందర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.