Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
పోడు భూముల సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, తహసీల్ధార్ ముల్కనూరు శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. మండలంలోని కాల్వపల్లిలో సర్వే మందకోడిగా నడుస్తుండడంతో సోమవారం కాల్వపల్లికి వెళ్లి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేస్తున్నప్పుడు రైతులు ముందుకు రాకుంటే రిజెక్ట్ చేయాలని ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్, పోడు భూముల సర్వేకు రైతులు సహకరించాలన్నారు. లేదంటే రిజెక్ట్ చేస్తారని అన్నారు. కాగా మండల వ్యాప్తంగా 6436 క్లెయిమ్స్‌కు, 4475 క్లెయిమ్స్ పూర్తయ్యాయని అన్నారు. మిగతావి కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వపల్లి, వెంగళపూర్, నార్లాపూర్ లింగాల గ్రామాల్లో అధికంగా పోడు సర్వే చేయాల్సి ఉందని, అధికారులకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.