Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
కాటారం మండల కేం ద్రంలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే యులకు ఇంటి స్థలాలు ఇప్పి స్తామని కాటారం ఎమ్మార్వో శ్రీనివాస చారి హామీ ఇవ్వడం జరిగింది.మంగళవారం ప్రెస్ క్లబ్ హడక్ కమిటీ కన్వీనర్ కొట్టు శ్రీశైలం, సభ్యులు ఎంఎ ల్ఎన్ మూర్తి, సుమన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస చారి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కాటారం మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు. డిసెంబర్ మాసంలోగా ఇంటి స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు ఇచ్చిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు నారమళ్ళ సారయ్య, కారంగుల శ్రీనివాస్, కారంగుల సమ్మయ్య, కాయిత తిరుప తి, ఎండి ఇంతియాజ్, మంత్రి రాజబాబు, గోనే సుధాకర్, వంగల దేవేంద్ర చారి, కట్ల రవి, గజ్జల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.