Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని
నవతెలంగాణ-ములుగు
ప్రశాంతమైన వాతావరణంలో ఎస్ఏ-1 పరీక్ష లు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణి ని తెలిపారు.1 నుండి 10 తరగతులకు ఎస్ఏ-1 ప రీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధి కారి పాణిని ములుగు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ బండారుపల్లి పాఠశాలని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడు తూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకో వాలని సూచించారు. పరీక్ష అయిన వెంటనే ఏరోజు కారోజు ప్రశ్నపత్రాలు ఉపాధ్యాయులచే మూల్యాంక నం చేయించి వాటిని రికార్డులలో నమోదు చేయా లని తెలిపారు. ఉదయం పరీక్ష పూర్తయిన తరగతుల విద్యార్థులను మరుసటి రోజు పరీక్ష కోసం సన్నద్ధం చేయాలని తెలిపారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
గోవిందరావుపేట : ఎస్ఏ-1 పరీక్షలను పక డ్బందీగా నిర్వహించాలని డీసీఈబీ కార్యదర్శి ఎన్నం విజయమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని కస్తూర్భా పాఠశాల, చల్వాయి మోడల్ పాఠశాలలను విజయమ్మ ఆకస్మికంగా సందర్శించి పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లా డు తూ ఈ నెల 7 వరకు జరిగే ఈ పరీక్షల్లో విద్యార్థు లు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంత వా తావరణంలో రాయాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసుకోవడానికి అనుకూల మైన వాతావరణం, సీటింగ్ ఏర్పాట్లు, గాలి వెలుతు రు సరిగా ఉండేటట్లుగా సౌకర్యాలుకల్పించాలని సూచించారు. విద్యార్థుల సమాధానపత్రాలు ఏ రోజు కు ఆరోజు మూల్యాంకనం చేసి రికార్డులలో నమోదు చేసేట్లుగా సంబంధిత టీచర్లకు సూచించాలని తెలి పారు. ఉదయం పరీక్ష పూర్తయిన విద్యార్థులకు మ ధ్యాహ్నమే మరుసటి రోజు జరగబోయే పరీక్షకు సన్న ద్ధం చేస్తూ స్టడీ అవర్ నిర్వహించాలని సూచించారు. వీరివెంట ఎంఈవో గొండి దివాకర్, డీసీఈబీ సహా య కార్యదర్శి విక్రమ్ రాజ్ పాల్గొన్నారు.
విద్యార్థులను సంసిద్ధులను చేయాలి
మంగపేట : జిల్లా వ్యాప్తంగా 1 నుండి 10 త రగతి విద్యార్థులకు మంగళవారం ప్రారంభమైన సం గ్రహణాత్మక మూల్యాంకనం పరీక్ష లను పకడ్బంధీగా నిర్వహించాలని ఎంఈవోలకావత్ రాజేష్ కుమార్ అ న్నారు. మూల్యాంకనం పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల పత్రాలను ఏ రోజు ప్రశ్నపత్రాలను ఆరోజే మూల్యాంకనం చేసి తదుపరి పరీక్షలకు విద్యా ర్థులను సంసిద్ధులను చేయాలని ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు ఎంఈఓ తెలి పారు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా విద్యా శాఖ నుండి వచ్చిన సంగ్రహణాత్మక మూల్యాంకనం టైం టేబుల్‌ను తప్పని సరిగా అమలు చేసి విద్యార్థు లు మూల్యాంకనం పరీక్షలకు వందశాతం హాజర య్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.