Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
- 24 గంటలు స్త్రీ వైద్య నిపుణులు, ప్రత్యేక వైద్యులు
- సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలకుమెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో పటిష్టమైన చర్యలు చే పట్టా మని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జి ల్లా కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, సి బ్బంది, పోస్ట్ మార్టం సేవలు, పారిశుద్ధ్యం, పౌష్టికాహా రం, రోగులసహాయకులకు వసతులు మొదలైన అం శాలపై డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం, మెడికల్ సూప రింటెండెంట్ సంజీవయ్యతో కలిసి సమీక్ష నిర్వహిం చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప టిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆసుప త్రిలో అవసరమైన మేర సిబ్బందిని ఏర్పాటు చేయా లని, ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది వివరాలు నోటిస్ బోర్డు పై ప్రతి రోజూ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి మాసం బయో మెట్రిక్ అటెండెన్స్ నివేదిక సమర్పించాలని తెలిపా రు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సి బ్బందికి ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు అందిం చాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు, ఇనుపగేటు ఏర్పాటు ప్ర తిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టంగది సిద్ధం చేశామని ఇకపై మెడికల్ లీగల్ కేసులు పోస్టు మార్టం కోసం పరకాలకు పంపకుండా భూపాలపల్లి లో నిర్వ హించాలని కలెక్టర్ ఎస్పీకి, మిషన్ భగీరథ ద్వారా నీటిసరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ము న్సిప ల్ కమిషనర్ కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ స్పత్రిలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైన మేర జనరేటర్స్ బాటలో పెట్టాలని, అదనంగా 100 కెవి ట్రాన్స్ఫార్మర్ పనులు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచిం చారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతులు, ప్రత్యేక వైద్య నిపుణులు, ఉచిత వైద్యం అందుబా టులో ఉన్నప్పటికీ అక్టోబర్ మాసంలో కేవలం 136 ప్రసవాలు జరగడం పట్ల కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు, ప్రతి నెలా కనీసం 180 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేవిధంగా లక్ష్యం నిర్దేశించుకుని పని చేయాలని అధికారులకు సూచించారు.
గర్భిణుల రిజిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రు లలో ప్రసవం నిర్వహించే వరకు ఫాలో అప్ చేయా లని పేర్కొన్నారు.24 గంటల పాటు ప్రభుత్వ ఆసుప త్రిలో స్త్రీవైద్యనిపుణులు, ప్రత్యేక వైద్యులు అందుబా టులో ఉంటారని, ఉచితంగా తల్లి బిడ్డల పూర్తి సంరక్షణ ఉండేలా అత్యున్నత వైద్య సేవలు అందిస్తా మని, వీటిని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజల ను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల కోసం 8713221022, 9121153731 నెంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 71 మంది సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కింద నియమించామని,24 మంది పారిశుధ్య కార్మికుల సమర్థవంతంగా వినియోగించు కుంటూ ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా కలె క్టర్ ఆసుపత్రి ఆవరణలో కేంద్ర ఔషధ గిడ్డంగికి కే టాయించిన 1 ఎకరం స్థలాన్ని పరిశీలించారు అనం తరం జిల్లా ఆస్పత్రిలో ఓపి వివరాలు, వివిధ వార్డుల ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, సిబ్బంది నుంచి అందిస్తు న్న వైద్య సేవలు భోజనాల పై రోగుల నుండి వివరా లు కలెక్టర్ ఆరా తీశారు. ఈ సమీక్షా సమావేశంలో వై ద్యాధికారులు, సంబంధించిన అధికారులు తదితరు లు పాల్గొన్నారు.