Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రజలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానాలి
- గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు సామాజిక సమస్య
- నేడు జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష : సీతారాంనాయక్
నవతెలంగాణ-ములుగు
తెలంగాణలో గిరిజనుల హక్కులను కేంద్రం హ రిస్తుందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరి జన యూనివర్సిటీ ఏర్పాటు జాప్యానికి నిరసన దీక్ష బుధవారం ములుగులో నిర్వహించడం జరుగుతుం దని మేధావులు, సామాజికవేత్తలు, వామపక్షాలు, గి రిజన, గిరిజనేతర కుల సంఘాలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. గిరిజనుల బాగు కోసం గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయని , మధ్యప్రదేశ్ లో ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా గత ప్రభుత్వాల హయాంలో ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని విజ యనగరంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కింద కేంద్ర విశ్వవిద్యాలయం కూడా ప్రారంభమైందని, తె లంగాణలో గిరిజన విశ్వవి ద్యాలయం ఏర్పాటు చేయ కుండా కేంద్రం తాత్సారం చేస్తూ కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు యూనివర్సిటీవిషయమై అబద్ధాలాడుతు న్నారన్నారు.గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ రా ష్ట్రానికి కావాలని విభజన సమయంలో సీఎం కేసీ ఆర్ దానిని విభజన చట్టంలో పొందుపరిచే విధంగా శక్తివంచన లేకుండా కషి చేయగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తూ యూనివ ర్సిటీ ఏర్పాటుకు వెనకంజ వేస్తుందన్నారు. యూని వర్సిటీ ఏర్పాటు చేయకుండా ఎందుకు గిరిజన విద్యా ర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపులు జరగలేదని అనడం విడ్డూరం గా ఉందని ఆ వ్యాఖ్యలు తప్పని మేము నిరూపిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా ? అ ని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల మీద కేంద్రం కక్ష సాధింపు చేస్తుందని, 317 ఎకరాల భూమిని గిరిజన యూనివర్సిటీకి కేటాయించినప్పటికీ ఇక్కడ పనులు ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనాం చేస్తు న్నందుకు నిరసనగా చేపట్టే నిరసన దీక్షకు అందరూ తరలిరావాలని కోరారు.
కేంద్రం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి యూనివ ర్సిటీ ఏర్పాటు చేయాలని, గిరిజనుల భరోసా యాత్ర లు నిలిపివేసి గిరిజనుల హక్కులు కేంద్రం కాల రా యకుండా బీజేపీ నాయకులు చూడాలన్నారు. ఈ స మావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ బడి నాగజ్యోతి, వివిధ మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీ ణ్, లింగాల రమణారెడ్డి, కుడుముల లక్ష్మీనారాయణ, సాయికుమార్, ఈర్ప సురయ్య, భుక్యా అమర్‌సింగ్, సీపీఐ పార్టీ అధ్యక్షులు జంపాల రవీందర్, సాధన సమితి అధ్యక్షులు ముంజాల బిక్షపతి, చెన్న విజరు, గోవిందరావుపేట ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు సురేష్ నాయక్, లకావత్ నరసింహ, ఇస్లావత్ బాలకష్ణ, రాందాస్, అదిరెడ్డి, భాస్కర్, వేల్పురి సత్యనారాయణ, చక్రపాణి, భూక్య దేవ్‌సింగ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.