Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాలకే వాడాలి
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు గడువు ముగిసి ఐదేళ్లు గ డుస్తున్నా నేటికీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించక పోవడం తో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌర వించి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి డిఎంఎఫ్టి నిధులు రూ.2740 కోట్లు సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించుక పోతున్నారన్నారు. గోదావరిఖని మెడికల్ కాలేజీకి రూ.500 కోట్ల సింగరేణి నిధులు, ప్రభుత్వ ఆసుపత్రికి రూ.2కోట్ల నిధులతో సింగరేణికి సంబం ధంలేని ఆసుపత్రికి సిటీ స్కాన్ కోసం కేటాయించారన్నారు. భద్రాచలం వరదల్లో ముంపుకు గురైన ప్రజలకు రూ.1000 కోట్లతో శాశ్వత నిర్మాణం కోసం నిధులు కేటాయిండాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సింగరేణికి రూ.24 వేలకోట్లు బకాయిఉందని వాటిని ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించా రు. ఇంత సింగరేణి ప్రజాధనం వధా అవుతున్న టీబీజీకేఎస్ ఎందుకు స్పందిం చడం లేదని మండిపడ్డారు. టీబీజీకేఎస్ సింగరేణి యాజమాన్యం మిలాకత్ తోనే ఎన్నికలు నిర్వహించడంలేదని విమర్శించారు. రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిం చనిపక్షంలో దశలవారి ఆందోళన పోరాటాలు ఉధతం చేస్తామని సీతరామయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొరి మి రాజ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ ఎల్లయ్య, భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఏఐటీయూసీ నాయకులు మాతంగి రామచందర్, నూక ల చంద్రమౌళి, కోటిలింగం, హైమద్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.