Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
మనువాద మతోన్మాద బీజేపీతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్‌లోని పెరుమాండ్ల జగన్నాథ భవన్లో సీపీఐ(ఎం) యువ కమ్యూనిస్టుల సమావేశం జంగ మునేందర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా సాదుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కులమతాల పేరిట ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగిపోతున్నా యన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ పూనుకుంటుందన్నారు. దళిత బహుజనుల పాలిట బద్ధశత్రువుగా నిలుస్తున్నదన్నారు. దేశ అభివృద్ధి అడుగంటి జీడీపీ 3.86 తగ్గిందన్నారు. అంబానీ, ఆధాని ఆస్తులు పెరిగితే దేశప్రజలు మాత్రం దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారని అన్నారు. సోమాలియా దేశం కంటే ఆకలి చావుల్లో మనదేశం వెనుకబందడిదన్నారు. ఆకలి చావుల్లో ప్రపంచంలో 131వస్థానంలో దేశం నిలిచిందన్నారు. మనువాద బీజేపీని గ్రామాలకు దళిత వాడలకు రానివ్వొద్దన్నారు. దళితులను, మైనార్టీలను పొట్టన పెట్టుకుంటున్న బీజేపీని తిప్పికొట్టాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మహబూబాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు మహమ్మద్ రజాక్ మాట్లాడారు. ఈ సమావేశంలో బుల్లెద్దుల మధు, చిలుముళ్ళ వెంకటేష్, పోతుగంటి బ్రహ్మచారి, చిట్టోదు కష్ణచారి, గండమల్ల నాగేష్ బాలు, రామ్, రహీం, జానీ, సురేష్, ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.