Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు ప్రజలు మరింత చేరువవుతారు
- వరంగల్ పోలిస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
నేరస్తులకు శిక్ష పడితేనే పోలీసులకు ప్రజలు మరింత చేరవవుతారని వరంగల్ పోలిస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. వరంగల్ పోలిస్ కమిషనరేట్‌కు చెందిన సెంట్రల్ జోన్ పరిధిలో వివిధ నేరాలకు పాల్పడిన నేరస్థులకు శిక్షపడటంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ న్యాయవాదులు, పోలిస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్ళను వరంగల్ పోలిస్ కమిషనర్ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది సెంట్రల్ జోన్ పరిధిలో జరిగిన వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితుల్లో ముగ్గురు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా మరో నిందితుడికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులకు శిక్ష పడటంలో ప్రతిభ కనబరచిన వరంగల్ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరక్టర్ కె.అజయ్‌కుమార్, పబ్లిక్ ప్రాసీక్యూటర్ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారి ఎస్.జనార్ధన్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జనార్థన్ రెడ్డితో పాటు కోర్టు కానిస్టేబుళ్ళు వి.రాజు, యం.వీరస్వామి, ఏ.సుధాకర్, జి.జ్ఞానేశ్వర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా పోలిస్ కమిషనర్ మాట్లాడుతూ... నేరానికి పాల్పడిన నేరస్థుడికి నేరాన్ని నిరూపించేందుకు అధికారులు, నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలన్నారు. కోర్టులో నేరస్థుడికి శిక్ష పడ్డప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం, గౌరవం పెరుగుతాయన్నారు. కోర్టు కేసులపై పోలీస్ అధికారులు తరుచూ సమీక్షించాలన్నారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ల్లు కరుణాకర్, రమేష్‌తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.