Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో అమరుడు తుడుం రామయ్య, తెలంగాణ అమరవీరుల స్థూపం, కాచనపల్లి, గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రం పై జెండా ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ... అసమానతలు లేని సమాజం కోసం, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ఉన్నత జీవితాన్నొదిలి పేద ప్రజల కోసం ప్రాణాలర్పించారన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజలపై పన్నుల భారం మోపుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి వారి వ్యక్తిగత ప్రయోజనాలే ద్యేయంగా పాలన కొనసాగుతుందన్నారు. దోపిడి వ్యవస్థ నిర్మూలన కోసం జరిగే ఉద్యమాలలో చురుకుగా భాగస్వామ్యం కా వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొర న్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు మొకాళ్ళ మురళి కష్ణ, మదార్, ఊకే పద్మ, రామగిరి బిక్షం, తుడుం వీర భద్రం, పొమ్మయ్య, నర్సింహా, ఏపూరి వీరభద్రం, తిర్మలేష్, గంగారపుబిక్షం, లింగయ్య, కొమురయ్య, గౌని భద్రయ్య, తుడుం అనురాధ, జినక రేణక తదితరులు పాల్గొన్నారు.
అమరులకు ఘన నివాళి...
భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అసువులు బాసిన అమరుల త్యాగాలను కొనియాడుతూ మంగళ వారం మండల పరిధిలోని ఇస్లాపురం గ్రామాలలో అమ రవీరుల స్తూపాలపై సీపీఐ(ఎంఎల్) ప్రజాపందా మండల కమిటీ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేసి అమరులకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) ప్రజాపందా మండల కార్యదర్శి బిల్లకంటి సూర్యం మాట్లాడుతూ...50 ఏళ్ల ప్రజా ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టులు కొవ్వొత్తుల కరిగిపోయి ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ముల్లా దారిలో పయనించి పోలీసు, భూస్వాములు, మాఫియా మూట దాడులలో అనేక మంది తన రక్తాన్ని చిందించి ఎర్రజెండా ను మరింత ఎరుపెక్కించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ప్రజా వ్యతిరేక తప్పుడు విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వర్గ పోరాటాలకు ముందుండి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎంఎల్) ప్రజాపందా డివిజన్ నాయకులు ఉమ్మగాని సత్యం, నాయకులు కత్తి అశోక్, పూజల లచ్చయ్య, బత్తుల ధనంజయ, ముత్యాల భద్రయ్య, చిన్నం రమేష్, గుర్రం పూర్ణ, సోమన్న తదితరులు పాల్గొన్నారు.