Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
చదివిన పాఠశాల అభివద్ధికి స్థానికులు, పూర్వ విద్యార్థులు కృషి చేయాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ కల్వకొలను జనా ర్దన్ రాజు, పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రధానోపా ధ్యాయుడు రంగయ్య ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు రూ.50వేల విలువైన బూట్లు, టై, బెల్టు, బ్యాడ్జీలు, ఐడీ కార్డులు మంగళవారం జిల్లా విద్యా శాఖ కోఆర్డినేటర్ మహాకాళి బుచ్చయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములుతో కలిసి పంపిణీ చేసి జెడ్పీటీసీ మాట్లాడారు. 'మన ఊరు-మనబడి'లో భాగంగా కోట్లాది రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తు న్నాడన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందుతుందన్నారు. విద్యా ర్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అందరూ సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లపు శోభ, ఉపసర్పంచ్ పీనాకపాణి, జెడ్పిఎస్ఎస్ హెచ్ఎం వేణుమాధవ్ రెడ్డి,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేవేందర్, పూర్వ విద్యార్థులు, దాతలు జనార్దన్ రాజు, గౌతమ్ కిషోర్, వినోద్, వాణి, మధు, డాక్టర్ రాము, సుధీర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.