Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెళ్లికట్టే సర్పంచ్ పోసాని పుష్పలీలసంతోష్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
'జాతీయస్థాయిలో వెళికట్టే గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తా. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సేవకే అంకితమ వుతా. ప్రభుత్వం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పాటుపడతా. జీపీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కషి చేస్తా. ప్రజల సహకారంతో అభివద్ధి దిశగా పయనిస్తా.' అని వెళికట్టే సర్పంచ్ పోసాని పుష్పలీలసంతోష్ నవతెలంగాణ ముఖాముఖితో వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే...
నవతెలంగాణ : గ్రామంలో అభివృద్ధి పనులు,నిధుల ఖర్చు వివరాలు ?
సర్పంచ్ : గ్రామంలో రూ.కోటి50లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి బొడ్రాయి వరకు మూడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాం. సుమారు రూ.50లక్షలతో సైడ్ డ్రైనేజీలు నిర్మించాం. నర్సరీ, స్మశాన వాటిక, ఆహ్లాదకరమైన పార్క్, గ్రామంలో సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయి. గ్రామంలో ఈజీఎస్ నిధులు కలుపుకొని సుమారు రూ.కోటి70లక్షల వెచ్చించి అభివృద్ధి పనులు చేశాం.
నవతెలంగాణ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీతోపాటు రోజు వారి పనులు, సమస్యల గురించి ?
సర్పంచ్: గ్రామంలో సుమారు రూ.50లక్షలతో ప్రతి సంవత్సరం పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. ఇప్పటివరకు 200 గేట్ వాల్స్ వేశాం. ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజీ పనులు చేపడుతున్నాం. ఇంతవరకు నీటి సమస్యలు తలెత్తలేదు. ప్రతిరోజు గ్రామంలో వీధులను శుభ్రం చేయడం, తడి పొడి చెత్త సేకరించడం, తదితర పనులు నిత్యం చేపడుతున్నాం.
నవతెలంగాణ: మీరు గుర్తించిన గ్రామ సమస్యలు ? పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు ఏంటీ?
సర్పంచ్: గ్రామంలో సైడ్ కాలువల నిర్మాణం పనులను గుర్తించి అనుమతి కోసం పంపించాం. రూ.15లక్షలతో సైడ్ కాలువల నిర్మాణం పనులకు అనుమతి వచ్చింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. రూ.5లక్షలతో ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణ పనులకు అనుమతి వచ్చింది. వాటిని కూడా త్వరలో ప్రారంభించి పనులు పూర్తి చేస్తాం. అభివద్ధి పనుల బిల్స్ కూడా చాలా వరకు వచ్చాయి. మిగతావి కూడా రావాల్సి ఉంది.
నవతెలంగాణ: మళ్లీ సర్పంచ్ ఎన్నికల పోటీలో ఉంటారా ? మీ జీవిత లక్ష్యం ఏంటీ ?
గ్రామ ప్రజలు కోరుకుంటే, పార్టీ ఆదేశిస్తే సర్పంచ్ గా పోటీలో ఉంటాను. గ్రామ ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం. గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తాను.