Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతి గహంలోని మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి నీరు వధాగా పోతోంది. అయినా అధికా రులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వసతిగృ హానికి దిగువనున్న 5, 6 వార్డు కాలనీ లోకి నీరు చేరడంతో సమస్య తలెత్తుతోంది. పలు మార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని శివునిపల్లిలో ఎస్సీ బస్తీలో కూడా తాగునీరు వధాగా పోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి: మునిగాల రమేష్, స్టేషన్‌ఘన్‌పూర్
నీరు ఇలా వథాగా పోతున్నాయని అధికారులకు చెప్పాం. ట్యాంకు నిండినప్పుడల్లా, ఇంటి ముందు నీటిమయమై పోతోంది. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నం.