Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని సింగరేణి అధికారులు
- భూనిర్వాసితుల సంఘం ఆందోళన
నవతెలంగాణ-భూపాలపల్లి
ఓసి-3 బ్లాస్టింగ్ బాధితులకు న్యాయం చేయాల్సిందేనని ఇప్పటివరకు సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఓసీ3 బాంబు బ్లాస్టింగ్లు మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని గుర్రం పేట, పెద్దాపూర్, మాధవరావుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బాధితులు ఆందోళన చేపట్టారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని రాంనా యక్‌తండా, సమీపంలో గల ఓసీ-3 ఆవరణలో నిరసన వ్యక్తం చేశా రు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూ అధికబ్లాస్టింగ్ల మూ లంగా అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.భూ ని ర్వాసి తుల సంఘం నాయకులు పోరిక సమ్మయ్య, పొరిక జగన్, మామిడి మొండయ్య, రాంచందర్, కె. సమ్మయ్య రంగయ్య, రమేష్‌లు మాట్లాడుతూబ్లాస్టింగ్వలన ఇళ్లకుగోడలు పగులు తున్నాయని ఆవేదనచెందారు. బొగ్గుబావి పక్కన ఉన్న బోర్లు పో తూ సమీపరైతులు నష్ట పోతున్నారన్నారు. గుర్రంపేట ఎస్సీ కాలనీ, రాంనాయక్తండావాసులు శ్వాసకోశసంబంధిత వ్యాధుల భారీన పడాల్సి వస్తుందన్నారు. గతంలో సింగరేణి యాజమాన్యం ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓసీ-3 పనులను ప్రారంభించిం దని, ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజ మాన్యం న్యాయం చేయాలని, లేని పక్షంలో పనులను అడ్డు కుంటామ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల ఓపెన్ కాస్ట్ బాధితులు పాల్గొన్నారు.