Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని మొట్లపల్లి జెడ్పీ హెచ్ఎస్లో బుధవారం ఎన్సీసీ అధి కారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులతో ఫీట్ఇండి యా ఫ్రీడమ్రన్ 3కె కార్యక్రమా న్ని నిర్వహించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నామని ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. సర్వతో ముఖాభివృద్ధికి క్రీడలు దోహదపడతాయని క్రీడలు ప్రాథమికస్థాయి నుండి విద్యా ర్థులకు ప్రాథమిక హక్కుగా ఉండాలని దానివలన విద్యార్థిని విద్యార్థుల కు శారీర కంగా మానసికంగా ఎదుగుతారని, నైతికంగా క్రీడాస్ఫూర్తితో దేశ పౌరు లుగా ఎ దుగుతారన్నారు. దేశానికి ఒక సైనికుడు రెండోవాడు రైతు మూడో వ్యక్తి క్రీడాకా రుడనిఈముగ్గురు నిస్వార్థంతో దేశసేవ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీక్యాడెట్స్ విజయ్, సుశాంత్, అఖిల, ఐశ్వర్య, 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.