Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగులో గిరిజన యూనివర్సిటీ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి
- నిరసన దీక్ష కార్యక్రమంలో మాజీ ఎంపీ, ప్రొఫెసర్ సీతారాంనాయక్
నవతెలంగాణ-ములుగు
గిరిజనులు దేశ నిర్మాణంలో పునాదిరాళ్లు అని మాజీ ఎంపీ, ప్రొఫెసర్ సీతా రాంనాయక్ అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సి టి నిర్మాణం కోసం కేటాయించబడ్డ ప్రభుత్వ స్థలంలో ఆయన గిరిజన యూనివర్సి టికి జరుగుతున్న జాప్యాన్ని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఉద్దేశ్య పూర్వక అలసత్వాన్ని నిరసిస్తూ ఆయన ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నాయకులతో కలిసి నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అబద్దాలు చెప్పుతూ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా వేరే రాష్ట్రానికి తరలిస్తున్నాట్లుగా వస్తున్న వార్తలను నిరసిస్తూ దేశ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కళ్లు తెరిపించడానికి తాము ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. గిరిజనుల జానపద కళరూపాలను వేల సంవ త్సరాలుగా దేశ ప్రతిష్టను వారు పెంచుతున్నారన్నారు. గిరిజనులు లేకుంటే దేశం లేదని చెప్పే ప్రధానమంత్రి మోదీ వ్యవహారం అందుకు విరుద్దంగా గిరిజనులు లేకుండా ఉండాలన్న ఆర్ఎస్ఎస్ సిద్దాంత రూపంలో కనబరుస్తున్నారన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో రాజకీయ వేదికలపై గిరిజనుల అభివృద్ది ద్యేయమని చెప్పే ప్రజా ప్రతినిధులు ఎనిమిది సంవత్సరాలుగా విద్యా బుద్దులు ,విజ్ఞానం గిరిజన సంస్కృతి సాంప్రాదాయాలను వెలికితీసే ఆంతర్యం ఏమిటని అ న్నారు. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు ఎంపిలు కానీ, గిరిజన విశ్వ విద్యాల యంగురించి పార్లమెంట్లో మాట్లడకుండా రాష్ట్రంలో భూమి ఇవ్వలేదని బూకా యించడం దురదష్టకరమని తెలంగాణపై వారికి చిత్త శుద్ది లేదని ఈ సంఘటన తెలుపుతుందని గిరిజన బీజేపీ ఎంపీ గిరిజన తెగల మధ్య లబ్ది కొరకు పాటు పడే కంటే గిరిజన అభివృద్ధికి సంబంధించి గిరిజన విశ్వ విద్యాలయం కొరకు పాటుప డితే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా కళ్లు లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాన మంత్రి, రాష్ట్ర మంత్రులు ఇప్పటికైన కళ్లు తెరిచి అసత్యాలు మాని అబద్దాలు స్వస్తి పలికి వెంటనే ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం నెలగొల్పేందుకు ములుగు రావాలని ఆయన హితవు పలికారు. అనంతరం ఐక్యతఅవివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.