Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనుల్లో వెనుకబడిన గ్రామాల్లో నైట్‌హాల్ట్ చేయాలి
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేతనాల్లో కోతే ...
- ఉపాధిహామీ పనులపై సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 20 వరకు జిల్లాలోని గ్రామాలు, ఆవా సాలలో మంజూరు చేసిన క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సం బంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్ర గతిభవన్ సమావేశం మందిరంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఉపాధిహామీపనుల పురోగతి వంటి ప లు అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ది వాకర్‌తో కలిసి ఎంపిడిఓలు, సంబంధిత అధికారుల తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 241 గ్రామాలు, 150ఆవాసాల్లో 233 క్రీడా ప్రాంగణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేసి, 213 క్రీడా ప్రాంగణాలను మంజూరు చేసామని అధికారులు తెలిపారు. జిల్లా లో ఇప్పటి వరకు 142 క్రీడా ప్రాంగణాలు పూర్తి చే శామని, మిగిలిన ప్రాంగణాల పనులను వేగవంతం చేస్తూ నవంబర్ 20నాటికి పూర్తి చేయాలని ఆదే శించారు. గ్రామంలోని విద్యార్దులు, యువత ఆడు కునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు జర గాలని, క్రీడ ప్రాంగణాల కోసం ఎంపిక చేసిన స్థలాల అనుకూలతను మండల ప్రత్యేక అధికారి ప్రతిగ్రామం సందర్శించి తనిఖీ చే యాలని కలెక్టర్ ఆదేశించారు.
క్రీడా ప్రాంగణానికి రాకపోకల మార్గం, గ్రామా నికి అందుబాటులో ఉన్న దూరం తదితర అంశాలను చెక్‌లిస్ట్ రూపొందించుకొని వివరాలు నమోదు చే యాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసి న ప్రతి క్రీడా ప్రాంగణానికి నెలాఖరు వరకు బయో ఫెన్సింగ్పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న పనులు ప్రజలు వినియోగించుకునే వి ధంగా ఉండాలని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తనిఖీ స మయంలో రిమార్కులు నమోదు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తయిన వాటి ఎంబి రికార్డు ఏర్పాటు చేసి, అందులో ఖర్చు వివరాలు నమోదు చ లని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ అభివద్ధి పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శి , ఇతర సిబ్బంది వేతనాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.మల్హాపూర్, ముత్తారం మహాదే వపూర్, భూపాలపల్లి,పలమేల,రేగోండ మండలాల లో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల అమలులో వేగం పెంచాలని, ప్రతి గ్రామంలో సమాంతరంగా ఉపాధిహామీ అభివృ ద్ధి పనులు నిర్వహించాలని సూచించారు.
పనులలో వెనుకబడిన గ్రామాలను ఎంపిక చే సి, సదరు గ్రామాల్లో అధికారులు నైట్ హాల్ట్ నిర్వ హించి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనులకు సంబంధించి లేబర్ కాంపోనెంట్, మెటీరి యల్ కాంపోనెంట్, వివరాలు ప్రతి గ్రామపంచా యతీ వారిగా నమోదు చేయాలని, సంబంధిత పను ల పురోగతి ఫోటోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనుల అమలు తీరుపై మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృ ద్ధి సంస్థ అధికారి పురుషోత్తం, ఇంచార్జీ జడ్పీ సీఈవో రఘువరన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఏపీవో లు తది తరులు పాల్గొన్నారు.