Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి మత్తులో తూగుతున్న యువత
- యథేచ్చగా సాగుతున్న గంజాయి రవాణా
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
నవతెలంగాణ-వరంగల్
నగరం నడిబొడ్డున గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నా యని తద్వారా యువత గంజాయి అడ్డాల్లో అర్థరాత్రి వరకు మత్తులో తూగుతున్నారని పలువురు అనుకుంటున్నారు. దీంతో యువత గంజా యికి బానిసవడంతో నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెట్రేగిపో తున్నాయి. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు మాత్రమే సంబం ధిత అధికారులు అలర్ట్ అయి ఆ తర్వాత చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచుగా పెద్ద మొత్తంలో పోలీసులు గంజాయి విక్రయదారులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి విక్రయదారులు గుట్టు చప్పుడు కాకుండా మరో కొత్త కోణంలో విక్రయాలు సాగిస్తున్నారు. యువత గంజాయి అడ్డాల్లో అర్ధరాత్రి వరకు మత్తులో ఉన్నప్పుడు అసాంఘిక కార్యక లాపా లకు పాడుతున్నారు. హత్యలు, హత్యాచారాలు, దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పలుమార్లు పోలీసు అధికారులు గంజాయి రవాణా చేయవద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రవాణా మాత్రం ఆగడం లేదు. గతంలో కొంతమంది పోలీసుల బంధువులు సైతం గంజాయి రవాణా చేయగా పట్టు బడిన ఘటన చోటు చేసుకున్న సంఘటనలు లేకపోలేదని గుసగుసలా డుకుంటున్నారు. కొంతమంది పోలీసులు గంజాయి విక్రయదారులకు సహకరిస్తున్నారని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అర్థరాత్రిలో పెట్రో లింగ్ ప్రధాన కూడలిలో మాత్రమే పరిమితం కాకుండా గంజాయి అడ్డా ల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని పలువురు అనుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నగరంలోని ప్రతి కాలనీలో ఎక్కువసార్లు పెట్రోలింగ్ చేయాలని, అద ేవిధంగా గంజాయి అడ్డాల్లో పోలీసులు తనిఖీ చేయాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.