Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్
నవతెలంగాణ-హన్మకొండ
నిరుద్యోగ యువతీ, యువకుల సమస్యలపై ఉద్యోగ, ఉపాధి హక్కులపై నిరంతరం పోరాటాలు సాగిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ అన్నారు. బుధవారం డివైఎఫ్ఐ హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలోని పలు కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కమిటీ సభ్యులు మోతె సతీష్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కిషోర్ మాట్లా డుతూ డివైఎఫ్ఐ యువజన సంఘం 1980, నవంబర్ 3న పంజాబ్ రాష్ట్రంలో ఆవిర్భవించిందన్నారు. యువతీ యువకుల సమస్యలపైనా ఇతర సమస్యలపైనా ఎన్నో రాజీలేని పోరాటాలు చేసినట్లు తెలిపారు. కేంద్రలో బిజేపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఉద్యోగాలు కల్పించే సంస్థల ను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి చేతులు దులు పుకుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున నిరుద్యో గులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల విజరు, ఎన్నాము వెంకటేశ్వర్లు, అనిల్, జంపన్న, రాజేందర్, సందీప్, అనిల్, సదయ్య, కుమార్, సతీష్, వినరు, దేవేందర్, ఠాగూర్, నరేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డివైఎఫ్ఐ 42 వ
ఆవిర్భావ దినోత్సవం
కాజీపేట : యువత సమస్యలపై పోరాడేందుకు డివైఎఫ్ఐ నిరంతరం సిద్ధంగా ఉంటుందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, కాజీపేట మండలం ఉపాధ్యక్షులు చిలుక జంపన్న అన్నారు. డివైఎఫ్ఐ 42వ ఆవిర్భావ దినోత్సవన్ని బుధవారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు తొట్టె మల్లేశం అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వారు హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన సమస్యల పరిష్కారానికి డివైఎఫ్ఐ అవిర్భవించిందని అన్నారు. అందరికి విద్య, ఉపాధి లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని, దేశ వ్యాప్తంగా నిరు ద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అనిల్, సదయ్య, శ్రీనివాస్, ప్రణరు, భీమన్నా తదితరులు పాల్గొన్నారు.