Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి
నవతెలంగాణ-కాజీపేట
అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా విధులు నిర్వహించాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. నిట్‌లో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి రహిత భారతదేశం అనే అంశంపై బోస్ సెమినార్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ డాక్టర్ తరుణ్ జోషి, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణరావు, ప్రొఫెసర్ ఉమా మహేష్, రిజిస్టర్ గోవర్ధనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ జోషి మాట్లా డుతూ అవినీతి అనేది స్వార్థపూరిత మనస్సు నుండి వచ్చిన మానసిక స్థితి అన్నారు. అవినీతి రహిత దేశాన్ని చూడాలనే కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. రమణా రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సంద ర్భంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధ్య తగా విధులు నిర్వహించినప్పుడు అవినీతి రహిత దేశాన్ని చూడగల మన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకోవడం బా ధ్యత అన్నారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలోని నిబంధన 3, సం పూర్ణ సమగ్రతను కాపాడుకోవడం, అన్ని సమయాల్లో విధికి అంకితం చేయ డం, ప్రభుత్వ ఉద్యోగికి అనాలోచితంగా చేయకూడదన్నారు కార్యక్రమంలో డీన్లు, డిప్యూటీ రిజిస్టర్ సౌమెన కర్ణాకర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.