Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల అండదండలతో కబ్జాదారుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు
- సిపిఎం పార్టీ రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్
నవతెలంగాణ-మట్టెవాడ
కాకతీయుల కాలం నాటి పుట్టకోట లో 1800 ఎకరాల భూమి ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి ఆనవాళ్లు లేకుండా కబ్జా దారులు కబ్జా చేస్తున్న పురావస్తు శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు గా వ్యవహరించడం శ్రేయస్కరం కాదని రంగశాయి పేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా మామునుర్ సింగారం ప్రాతంలోని పుట్టకోట లోని పుర వా స్తు శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన భూమి నీ తప్పుడు సర్వే నెంబ ర్లతో ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసిన ప్రాంతాన్ని బుధవారం సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఎకరాల్లో ఉండాల్సిన పుట్టకోట భూ మి దర్జాగా కబ్జా అవుతుంటే చూసి చూడనట్టు ఉంటున్నా పురా వస్తు శాఖ వరంగల్ జిల్లాలో అసలు ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమ వుతుందని ఒకవేళ ఉంటే భూములన్ని దర్జాగా కబ్జాల పాల వుతుంటే ఈ శాఖ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఈ పుట్టకోట భూమి అంత పురావస్తు శాఖ కింద సెంట్రల్ గవర్న మెంట్ ఆధీ నంలో ఉండాలనీ ఇది కాకతీయ నాటి కాలంనాటి ఆనవాళ్ళు చరిత్ర తో ముడిపడి ఉన్న ప్రదేశం అని అన్నారు. కాకతీయుల వైభవాన్ని కళ్ళకు కట్టేసే పుట్టకోట ఆనవాళ్లను తొలగించి దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల రాబోయే తరాలు చరిత్ర తెలియ కుండా పోతుందని ఆవేదన చెందారు. ఇంత పెద్ద ఎత్తున పురావస్త భూమిని కబ్జా చేస్తూ కోట్ల రూపాయల దందా చేస్తున్న ప్రభుత్వం కానీ పురావస్తు శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దుర్మా ర్గమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులు కళ్ళు తెరిచి న్యాక్రాంతం అయినా భూమిని కబ్జా కోరుల చేతుల్లో నుండి స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో ఇక్కడి పేద ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అధి కారులను హెచ్చరించారు. ఈ సందర్శన కార్యక్రమంలో రంగ శాయిపేట ఏరియా కమిటీ సభ్యులు గణేపాక ఓదెలు,ఎం ప్రత్యుష, డి సాంబమూర్తి, ఎస్ దాసు, కె బాబు, ఎస్ సురేష్, ఎస్ మల్లయ్య, సీపీఎం నాయకులు ఇమ్మడి శ్రీనివాస్, ఉసిల్ల కుమార్,సింగారం ప్రకాష్ కొత్తూరు అనిల్ రాజు అవాజ్ కమిటీ కార్యదర్శి ఎండీ అజ్జు, ఉసిల్లదీప, శాగంటి ప్రభాకర్ నరకుడు బాబు గుర్రం వెంకటేష్ ఉదయశ్రీ లకిడి లక్ష్మి సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు మరియు ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.