Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2023-24 సంవ త్సరం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలలో నూతన కమిటీనీ ఐఎం ఏ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా ఐఎం ఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవీంద్ర రెడ్డి హాజర య్యారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన గార్డియన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కాళీ ప్రసాద్ దంపతులకు గజ మాలతో ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ హెచ్.సంధ్యారాణి ఎస్డబ్ల్యూసి సభ్యులు డాక్టర్ సుధాకర్‌రెడ్డి, డాక్టర్ బందెల మోహన్ రావు, సిడబ్ల్యూఎస్సీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ భోక్రే, జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎం సుదీప్ డాక్టర్ పి సుధీర్ కుమార్ లకు శాలువాలతో సత్కరించారు. జాతీయ స్థాయి లో ఎన్ఎస్వి సర్జరీలతో గుర్తింపు పొందిన హనుమకొండ జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఎండి యాకూబ్ పాషా నీ వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది. అనంతరం సభను ఉద్దేశించి విశిష్ట అతిథి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యుల సమస్యల తో పాటు ఆసుపత్రుల పరిస్థితులు పై పూర్తి అవగాహన ఉన్న కాళీ ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికవ్వడం శుభ పరిణామమని అన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెలికల్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు డాక్టర్ బైరం బాలాజీ, కార్యదర్శి నాగార్జున రెడ్డి, కోశాధికారి డాక్టర్ సనత్ ఇతర వైద్యులు పాల్గొన్నారు.