Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవిపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్
నవతెలంగాణ-హన్మకొండ
అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాం డ్ చేశారు. బుధవారం కెవిపిఎస్ హను మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వ ర్యంలో జోగులాంబ గద్వాల్ జరిగిన అంబేద్కర్ విగ్రహ ధ్వంసం చేయడంపై హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేం దర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా బిజెపి పరిపాలనలో అనేక రకాల కుల వివక్షత, అంటరానితనం, అత్యాచారాలు, దా డులు, నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అంబే ద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలో స్వేచ్ఛ, సమా నత్వం, సౌబ్రతత్వం డెమోక్రసీ పరిపాలన కొనసాగడం లేదని ప్రతి పౌరుడు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించలేక పోతున్నడని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఇలాంటి అవమానాలను విగ్రహాలను వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టాలని కచ్చితంగా రా ష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం అమలు చేయాలని లేని ఎడల ప్రజలందరి కూడగట్టుకొని ప్రజాసంఘాలుగా మేధావు లుగా అందరిని ఒకే ఐక్య మీదికి తీసుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ భవిష్యత్తులో జరిగే ఆందోళన పోరాటాలను ఉదతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కంచర్ల కుమారస్వామి, కెవిపిఎస్ సౌత్ మండల అధ్యక్షులు మేకల రఘుపతి, కెవిపీఎస్ జిల్లా నాయకులు హర్షం రాంకి, జడ రమే ష్, సంపత్ కుమార్, రాజేందర్, మురళి, సురేష్, శోభ, దేవ కి, రజిత, తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మా ర్పీఎస్ టీఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జి నర్మెట యాదగిరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగులంబ గద్వాల్ జిల్లాలోని దరూర్ మండలంలోని రేవుల పల్లిలో అదే గ్రామానికి చెందిన రఘు అంబేద్కర్ విగ్రహాన్ని తలపై రాయితో కొట్టి విరగగొట్టిన రఘును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్ని అంబేద్కర్ విగ్రహల దగ్గర సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.