Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు వెంటనే మద్ద తు ధరను ప్రకటించాలని ఆలిండియా కిసాన్ సభ ఉపాద్యక్షులు సారంపెల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ లోని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రైతు సంఘం (ఏఐకేస్) హన్మకొండ జిల్లా ప్రథమ మహా సభలు నిర్వహించారు. మహాసభకు ముమ్మిడి శ్రీకాంత్, బండి పర్వతాలు, సుమలత అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను కోటీశ్వరులను చేస్తానని ఎన్ని కల్లో హామీలిచ్చి ఆచరణలో మాత్రం మరింత నష్టం చేసే విధంగా చట్టాలు తీసుకువస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ను ఆదుకునే విధంగా కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించమని రైతులు ఒకవైపు ఉద్యమాలు చేస్తూంటే దొంగచాటుగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజీపీ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్ కమిషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ రైతులు పంటలు కోసి కల్లాల్లోకి తెస్తున్న ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం తీసుకువచ్చిన ధరణి వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడు తున్నా రని, వెంటనే సమస్యలు పరిష్క రించాలని కోరారు. రైతుబంధును మరింతగా పెంచ డంతో పాటు కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శిగా ఎమ్.చుక్కయ్య, బొల్లమ్ సాంబరాజు, గుం డేకారి మహేందర్, మడిగ నాగరాజు జుర్రు సం పత్, రాజన్న సర్కార్, మేకిరి మోహన్ రావు, రవి, నరేందర్ రెడ్డి, హసీనా నారా యణరెడ్డి, శ్రీనివాసరావు, సుమన్, స్వరూప, శారద పాల్గొన్నారు.