Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా వుంచాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. బుధవారం కమిషనరేట్‌లో సెంట్ర ల్ జోన్ పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడిన పాత నేరస్తులపై దృష్టి సారించాలన్నారు. పోలీసు స్టేషన్ల వారీగా నేరాలు, దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులపై ఆయన ఆరా తీశారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్ధాల విక్ర యాలను కట్టడి చేసేందుకు శ్రమించాలని అధికారులకు సూచించారు. గంజాయి రహిత పోలీసు స్టేషన్గుర్తింపు వచ్చే విధంగా అధికారులు, సిబ్బంది కృషి చేయా లన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేయాలన్నారు. నేరాల నియంత్రణకై ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసుల గస్వీ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అధికారులు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. మిస్సింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మిస్సింగ్ కేసులను పరిష్కరించేందుకుగాను అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుందన్నారు. పెండింగ్‌లో వున్న కేసులను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సెం ట్రల్ జోన్ డిసిపి అశోక్‌కుమార్, అదనపు డిసిపి పుష్పారెడ్డి, ఎసిపిలు కిరణ్‌కుమార్, శ్రీనివాస్, గిరికుమార్, డేవిడ్ రాజు, తిరుమల్తోపాటు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.