Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
వాహనాల మరమ్మతుల్లో జాప్యం జరుగకుండా ఎప్పటికపుడు రిపేర్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.శుక్రవారం బల్దియా ఆధ్వర్యంలో బాలసముద్రం లోనీ వెహికిల్ షెడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాహనాల మరమ్మ తుల సమాచార నమోదు లాగ్‌బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనికిరాని పుష్కార్డ్లను తుక్కు చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరుప యోగంగా ఉన్న బ్యాటరీతో పనిచేసే రెండు ఆటో లను గమనించి వెంటనే వాటికి మరమత్తులు చేయించి విని యోగంలోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న సెకండ్ ట్రాన్సఫర్ స్టేషన్ పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఈఈ ని ఆదేశించారు. మేయ ర్ వెంట ఎలక్ట్రికల్ ఈఈ సంజయ్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్లు అవినాశ్, సత్య, కమాలుద్దీన్ ఉన్నారు.