Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు బి.నరసింహరావు
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రాణత్యాగాలతోనే విద్యార్థి ఉద్యమాలు ఫలించాయని అని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు బి.నరసింహరావు అన్నారు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ తమ అమూల్యమైన ప్రాణాలు త్యా గాలు చేసిన విప్లవ విద్యార్థి వీరుల సంస్మరణ సభలను నవంబర్ 5 నుండి 11 వరకు అన్ని విద్యాసంస్థల్లో విస్తతంగా నిర్వహిం చాలని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు బి.నరసింహ రావు పిలుపు నిచ్చారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ విద్యా సాధన కోసం, విద్యార్థుల హక్కుల కోసం 50 సంవ త్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ పీడీఎస్యూ వ్యవస్థాపకులు ఉస్మానియా అరుణతార జార్జి రెడ్డి, జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్, శ్రీ పాద శ్రీహరి,కోలా శంకర్, దుస్సా చేరాలు, రంగ వల్లి, స్నేహలత, సాంబయ్య, మారోజు వీరన్నలాంటి ఎంతోమంది విప్లవ విద్యార్థి నాయకులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారన్నారు. ఈ విద్యార్థి వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, విద్యార్థి వీరుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై నేటితరం విద్యార్థులు ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా విద్యారంగాన్ని పరిరక్షిం చుకోవడానికి విప్లవ విద్యార్థి అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బి.గోవర్ధన్, పీడీఎస్యూ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి ఈసం రాకేష్, నాయకులు శశి, గౌతమ్, జగన్, ప్రవీణ్, శంకర్, అశోక్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.