Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత భవన నిర్మాణ కార్మి కులుగా జీవిస్తున్న లక్షలాదిమంది కార్మికుల హక్కులు లేకుండా చేస్తున్న బిజెపి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొ చ్చింది. ఈ చట్టాల ద్వారా కార్మికుల జీవితాలు బజారున పడతాయి. కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరి హారం ఇవ్వకుండా చేయాలని కుట్ర చేస్తుందని సిఐటియు మండల కార్యదర్శి కడియాల మనోహర్, భవన నిర్మాణ సంగం మండల అధ్యక్షుడు క్యాతం మొగిలి అన్నారు. వీటికి వ్యతిరేకంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో భవన నిర్మాణ కార్మిక చట్టాల రక్షణకై నవంబర్ 8, 9వ తేదీలో చలో మహబూబాబాద్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఐటియు, భవన నిర్మాణ కార్మిక సంఘం నల్లబెల్లి సభ్యులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయ వంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మం డల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి గాజుల ప్రభా కర్, కోశాధికారి రాజమౌళి, సిఐటియు మండల నాయకులు బోడ ిగే సమ్మయ్య, పైడి, వీరాచారి, వెంకన్న, లక్ష్మీనారాయణ, లిం గయ్య, కత్తి సమ్మయ్య, రమేష్, అశోక్, కోటి, పాల్గొన్నారు.