Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యాధికారి డాక్టర్ సుమన్
నవతెలంగాణ-వరంగల్
వర్షాకాలం ముగిసిన అనంతరం శీతాకాలం ప్రారం భ సమయాల్లో వాతావరణం చల్లగా ఉండి ఒకేసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో వాతావరణానికి అలవాటు పడే వరకు కొంత మందికి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చాలా వరకు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలనీ కీర్తినగర్ పట్టణ ప్రాథ మిక ఆరోగ్య అధికారి డాక్టర్ బీ సుమన్‌తో నవ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
నవతెలంగాణ : ఆరోగ్యకేంద్రం గురించి మాటల్లో చెప్పండి ?
వైద్య ఆరోగ్య అధికారి : వరంగల్ జిల్లాలోని 16వ డివిజన్ కీర్తి నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా మౌలిక వసతులు కల్పించ డంలో ముందంజగా ఉండడంతో ఉన్నత అధికారులు రెండుసార్లు ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
నవతెలంగాణ : ప్రతిరోజు ఎంతమంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు?
డాక్టర్ సుమన్ : ప్రతిరోజు 90 నుండి 100 మంది రోగులలు ఓపి విభాగంలో వైద్య సేవలు పొందుతున్నారు. అదేవిధంగా పది మందిలోపు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.
నవతెలంగాణ: ఎంతమంది సిబ్బంది ఉన్నారు?
డాక్టర్ సుమన్ : ఇద్దరు డాక్టర్లు, స్టాప్ నర్సులు ముగ్గురు, ఫార్మసిస్ట్ ఒకరు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకరు, సూపర్వైజర్ ఒకరు, అకౌంటెంట్ ఇద్దరు, ఏఎన్ఎంలు 6, ఆశ వర్కర్లు 13, స్వీపర్ ఒక రు, వాచ్మెన్ ఒకరు మొత్తం 31 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
నవతెలంగాణ : ఏ ఏ కాలనీలో సేవలు అందిస్తున్నారు.
డాక్టర్ సుమన్ : బల్దియా పరిధిలో నాలుగు డివిజన్లోని కీర్తి నగర్, ఎన్టీఆర్ నగర్, సుందరయ్యనగర్, ఎస్ఆర్ నగర్, అబ్బనీ కుంట, క్రిస్టియన్ కాలనీ, సాయి గణేష్ నగర్, ఎస్ఆర్టి, టిఆర్టి, కొంతవరకు రెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకు సేవలు అందిస్తున్నాం.
నవతెలంగాణ : ఏ ఏ వైద్య సేవలు అందిస్తున్నారు.
డాక్టర్ సుమన్ : గర్భిణులకు సోమవారం, శుక్రవారం అదే విధంగా ప్రతినెలా 9న ఐరన్ సు క్రోజు, టీటీ ఇంజక్షన్లు, క్యాల్షియం, బి కాంప్లెక్స్, ఆల్బెండజోన్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేస్తు న్నాం. అదేవిధంగా ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా షుగర్, బిపి, క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధి వారికి ఇంటింటికి వెళ్లి మందులు పరీక్షలు చేస్తున్నాం.
నవతెలంగాణ : ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి
డాక్టర్ సుమన్ : పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఇమ్యునైజేశన్ ను గురు, శనివారంలో వారికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
నవతెలంగాణ : సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారా?
డాక్టర్ సుమన్ : మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యా ధుల పై ప్రత్యేకంగా ఇంటింటి సర్వే చేయడంతో పాటు పాఠశాలల్లో మురికివాడల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి రాట్ టెస్టులు ఈ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్నాం.
నవ తెలంగాణ : దీర్ఘకాల వ్యాధుల వారికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు.
డాక్టర్ సుమన్ : టీ బీ లక్షణాలు ఉంటే తెమడ తీసుకొని ఎంజీఎంకు పంపించి, అక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయి స్తున్నాం. నిర్ధారణ అయితే ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం.