Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నమాల
నవతెలంగాణ-వరంగల్
వంట గ్యాస్‌పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు. ఖిలావరంగల్ ఐద్వా ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఠాకూర్ భవాని జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షతన వంట గ్యాస్‌పై పెంచిన ధరలు తగ్గిం చాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌కు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారం చేపట్టాక పేదల నెత్తిన భారం మోపిందని మండిపడ్డారు. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. మహి ళల బ్యాంకు ఖాతాలో సబ్సిడీని వేయాలని లేని పక్షంలో ఐద్వా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. ధర్నాలో ఐద్వా ఏరి యా కమిటీ సభ్యులు ఎండి నాహీద్, జి రమ, ఎం మానస, ఎన్ శ్యామల, భవాని, కే రూప, సుజాత, రవళి తదితరులు పాల్గొన్నారు.