Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
ప్రాజెక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రెనింగ్ టీమ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హన్మకొండ పర్యవేక్షణలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్-హెల్త్ వెల్నెస్ సెంటర్స్ - ఆసంక్రమిత వ్యాధుల కార్యక్రమంలో భాగంగా పెద్దల సంరక్షణ, ఉపశమన సంరక్షణ, మానసిక న్యూరోలాజికల్, పదార్థాల వాడుక రుగ్మతలపై ఆశాలకు జరుగుతున్న శిక్ష ణా కార్యక్రమంపై రవికుమార్ ఐఈసీ అధికారి, ఆయుష్మాన్ భారత్, హెల్త్ వెల్నెస్ సెంటర్స్, హైద్రాబాద్ పిఓడిటి, జిఎంహెచ్లో జరుగుతున్న శిక్షణ ను పరిశీలిం చారు. ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ కె లలితాదేవి శిక్షణా కేం ద్రం శిక్షణ కార్యక్రమం గురించి అసంక్రమిత వ్యాధుల ప్యాకేజీ గురించి వివరించారు. జిల్లాలో 635 మంది ఆశాల కి శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం నుండి జిల్లాలోని ఏఎన్ ఎంలకు కూడా శిక్షణ ప్రారంభిస్తామన్నారు. రవికుమార్ ఐఈసి అధికారి మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లు బాగున్నాయని, ఆశా కార్యకర్తలు ప్రజలందరికీ నాణ్యమైన సేవలను అందిస్తూ అవసాన దశలో ఉన్న వారిని అక్కున చేర్చుకుని, ఆత్మీయ స్పర్శను, స్వాంతన, మానసిక ధైర్యం కలిగించాలన్నారు. ఆరోగ్య సంబంధిత ఖర్చులను తగ్గించి జీవిత కాల ప్రమాణం పెంచాలని సూచించారు. కార్యక్ర మంలో ఐఇసీ అధికారి, వి అశోక్ రెడ్డి, వి.సుశీల, ఎల్ చం ద్రశేఖర్, దయామణి, సలోమి ఎలిజబెత్, నీరజ, కమలా గ్రేస్, సుందరి, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.