Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొపెసర్ హరగోపాల్
నవతెలంగాణ-హసన్‌పర్తి
సమాజాభివృద్దికి ఉపయోగపడని విద్యా విధానం ఎందుకని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా వేలాది మంది విద్యార్థులతో కేయూ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం ఆడిటోరియంలో జరిగిన పీడీఎస్‌యూ రాష్ట్ర మూడవ మహసభ పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరుశురాం అధ్యక్షతన జరిగిన సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన జాతీ య విద్యా విధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనికి మాలిన సిలబస్‌ను విద్యారంగంలో ప్రవేశపెడుతున్నారని సమాజా భివృద్ధికి ఉపయోగపడని విద్యా విధానం ఎందుకని ప్రశ్నిం చారు. అన్ని రంగాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న దేశ పాల కులు కామన్ విద్యా విధానం అమలుచేయడంలో ఎందుకు వెనుకడుతున్నారని ప్రశ్నించారు. పేద దళిత గిరిజన వర్గాల విద్యా ర్థులు ఎక్కువగా డ్రాప్ అవుట్లకు గురవుతున్నారని దీనికి కారణం వారి ఆర్థిక సామాజిక స్థితిగతులే కారణమని వారిని అభివద్ధిలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణలో విశ్వవిద్యాలయాలను సంపూర్ణంగా విధ్వంసం చేశా రని వాటికి నిధులు విడుదల చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయ కుండా నిర్లక్ష్యం చేస్తున్నారని యూనివర్సిటీలో సామాజిక సమ స్యలపై పరిష్కారం చూపే మేధోపరమైన చర్చలు జరగడం లేదని ఇది సమాజానికి మంచిది కాదని తెలిపారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు మాట్లా డుతూ పీడిత ప్రజల పక్షాన విద్యార్థులు నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కానీ ఆదాని అంబానీ కంపెనీలకు లక్షల కోట్ల లాభాలు ఎలా వచ్చాయని పాలకులను ప్రశ్నించారు. విద్యార్థులు సమసమాజం కోసం జరిగే పోరాటాల్లో భాగస్వామ్యులు కావాలని విద్యార్థుల సమస్యల కోసం ఉద్యమాలే శరణమని తెలిపారు. ఇం కా ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జాతీయ కన్వీనర్ వి.సంధ్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.గోవర్ధన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి ఆరెల్లి కష్ణ, పీడీఎస్ యూ జాతీయ కన్వీనర్ ఎం.రామకృష్ణ , పీడీఎస్‌యూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యు. గనిరాజు, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.విజరు కన్నాలు మాట్లాడారు.
బహిరంగ సభ లో అరుణోదయ సాంస్కతిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి నిర్మల, భేంశంకర్ల నాయకత్వంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రాకేష్, నాగరాజు, మంజుల, గణేష్, రియాజ్, శ్రీశైలం ప్రజా సంఘాల నాయకులు బండి కోటేశ్వరరావు, నున్నప్పారావు, రాచర్ల బాలరాజు, ఎలకంటి రాజేందర్, గంగుల దయాకర్, తదితరులు పాల్గొన్నారు..