Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులు
- పోలీసులకు, లబ్ధిదారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం
- సిపిఐ పార్టీ జిల్లా నాయకులు అరెస్ట్
నవతెలంగాణ-కమలాపూర్
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్ల లోకి చొరబడి ఆక్రమించుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 320 మంజూరు కాగా అందులో 120 పూర్తయ్యాయి. మిగతా 200 ఇండ్లు నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికలలో వాగ్దానం చేసిన ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం జరగకపోవడంతో అర్హులైన నిరుపేదలు గత కొన్ని సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్ప టికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించక పోవడంతో శుక్రవారం ఉదయం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తా ళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి ప్రజాప్రతినిధులు అధి కారులు డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేద న్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వదిలి వెళ్లాలని పోలీ సులు చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమని లబ్ధిదారులు చెప్ప డంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సిపిఐ పార్టీ నాయకులకు పోలీసులకు ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇళ్లలోకి పోలీసులు చొరబడి నిరుపేదలను బలవంతంగా బయటకు పం పిం చేశారు. అధికారులు ప్రజాప్రతి నిధు లు నిరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేని యెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్ర మాలు చేస్తా మని సిపిఐ జిల్లా నాయ కులు జక్కు రాజు గౌడ్ తెలి పారు. సిపిఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.